టమోటాలు ఎక్కువగా తింటే ఈ 5 సమస్యలు..

టమోటాల్లో సహజంగా ఆమ్లశాతం ఎక్కువ. సిట్రిక్, మాలిక్ ఉన్న వీటిని అధికంగా తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గుండెల్లో మంట రావచ్చు.

టమోటాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మితంగా కాక ఎక్కువగా వినియోగిస్తే  కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలకు దారితీస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటే.

ఆర్థరైటిస్ ఉన్నవారు టమోటాలు తింటే కీళ్లనొప్పులు, వాపు తీవ్రతరం అవుతాయి. సోలనిన్ అనే పదార్థమే ఇందుకు కారణం.

టమోటాల్లో ఆక్సలేట్లు, పొటాషియం అధికం. ఇవి మోతాదుకు మించి తింటే కిడ్నీలకు ప్రమాదం. ఎందుకంటే, పొటాషియం పేరుకుపోవడం వల్లే కిడ్నీలో రాళ్ల సమస్య వస్తుంది.

టమోటాల్లోని ఆమ్మతత్వం నోటి పై పొరను చికాకు పెడుతుంది. ముఖ్యంగా పచ్చివి తీసుకుంటే నోటి పుండ్లు లేదా క్యాంకర్ రాచ్చు. నోటిపూతలు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.