నిమ్మకాయ తొక్కలతో  ఎన్ని లాభాలో ...

నిమ్మకాయతోనే కాదు వాటి తొక్కల వల్ల కూడా ఉపయోగాలుంటాయి. 

నిమ్మ తొక్కలో విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది.

వీటిని పేస్ట్ లాగా తయారు చేసి జుట్టు సంరక్షణకు ఉపయోగించవచ్చు. 

ఈ తొక్కలలో ఉండే బయోఫ్లావనాయిడ్స్ ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

నిమ్మ తొక్కలలోని ఫైబర్ కంటెంట్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.

నిమ్మ తొక్కతో స్నానం చేస్తే క్రిములు తొలగిపోతాయి.