బద్దకానికి కారణమయ్యే  ఆహారాలు ఇవే..

బేకరీ ఐటమ్స్ బ్రెడ్, కేక్, పఫ్ వంటివి వ్యక్తులను బద్దకస్తులుగా మార్చేస్తాయని ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు. 

కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తాగితే రిలాక్స్, రిఫ్రెష్ అనిపిస్తుంది. అయితే, ఎక్కువగా  తీసుకుంటే శారీరక  అలసటకు దారి తీస్తాయి.

చెర్రీస్‌లో మెలటోనిన్ పదార్థం ఉంటుంది. ఇది నిద్రకు కారణమయ్యే హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది.

పాస్తా, పిజ్జా లాంటి ప్రాసెస్‌డ్ ఫుడ్స్ జీర్ణక్రియను మందగించేందుకు కారణమవుతాయి. వీటిని అధికంగా తినడం వల్ల పనిచేయాలన్న ఉత్సాహం తగ్గుతుంది.

ఫ్రైడ్ ఫుడ్స్ తిన్న వెంటనే నిద్ర మత్తుగా అనిపిస్తుంటుంది. బద్దకాన్ని పెంచుతుంది.

బద్దకాన్ని తగ్గించాలంటే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోండి.