నానబెట్టిన శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

అవి తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది.

శనగల్లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. 

ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

నానబెట్టిన శనగలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల మధుమేహులకు ఇది మంచి ఆహారం

ప్రతిరోజూ ఉదయం ఒక గుప్పెడు నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్‌ బయటకు వెళ్లిపోతాయి.

ఫైబర్ ఎక్కువగా కలిగిన శనగలు జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే మలబద్దకాన్ని నివారిస్తాయి.