శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే  ఏం జరుగుతుందో తెలుసా..

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే  అధిక రక్తపోటు,  కిడ్నీలో రాళ్లు, గౌడ్, గుండె జబ్బుల సమస్యలు వస్తాయి.  

యారిక్ యాసిడ్ పెరగడానికి కొన్ని ఆహారాలు ప్రధాన కారణం అవుతాయి.

పీతలు, రొయ్యలు, ఎండ్రకాయలలో ప్యూరిన్ స్థాయిలు ఎక్కువ ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ పెరుగుదలకు కారణం అవుతుంది.

బీర్, ఇతర ఆల్కహాల్ ఆధారిత డ్రింక్స్ లో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెంచుతాయి.

అధికంగా చక్కెర పానీయాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

ఆస్పరాగస్, బచ్చలికూర, పాలకూర,  కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, బఠానీలు వంటి కూరగాయలలో ప్యూరిన్లు ఎక్కువ ఉంటాయి. యూరిక్ యాసిడ్ పెంచుతాయి

బీర్, బ్రెడ్, బేకింగ్ చేసిన ఆహారాలలో ఈస్ట్  ఉంటుంది. ఇది ప్యూరిన్ స్థాయిలు పెంచి యూరిక్ యాసిడ్ పెరగడానికి దారితీస్తుంది.