ఇవి తింటే చాలు కడుపులో ఉన్న చెత్తంతా క్లిన్ అయిపోతుంది..!

కాలీఫ్లవర్ ఇది కడుపులో ఏర్పడే అసిడిటీకి కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాను నిరోధించడంలో సహాయపడుతుంది.

పచ్చి బఠానీలు దాదాపు 7 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి.

చిలగడదుంపల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియకు మేలు చేసి ఆరోగ్యకరమైన పేగు చర్యలను ప్రోత్సహిస్తాయి.

పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

క్యారెట్ తినడం వల్ల ప్రేగుల కదలిక నియమితంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

బీట్రూట్ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూరగాయ. ఇది పేగుల కదలికను సవ్యంగా నిర్వహించడంలో సహకరిస్తుంది

బ్రోకలీ ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది.