కంటికి సరిపడా నిద్రపోలేకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు తిష్టవేస్తాయి
ఎంతసేపు నిద్రపోతామో కూడా ముఖ్యం. పగలు, రాత్రి ఎప్పుడు ఎంత నిద్రపోవాలో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది
నిద్రకు ఓ ఫార్ములాను సూచిస్తున్నారు నిపుణులు. దీనిని అనుసరిస్తే మీరు రాత్రి త్వరగా నిద్రపోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నిద్రవేళకు 10 గంటల ముందు కెఫిన్ తాగకూడదు. మీరు ఏదైనా తినాలనుకుంటే పడుకునే 3 గంటల ముందుగానే తినేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రవేళకు 2 గంటల ముందు ఆఫీసు పని లేదా ఇంటి పనులతో సహా ఏ పనినీ చేయకుండా ఉండాలి.
మీ కళ్ళను రక్షించుకోవడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పడుకునే 1 గంట ముందు మీ మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి
ఈ పద్ధతి మనస్సు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇస్తుంది. మీరు మరింత సులభంగా నిద్రపోవడానికి, ఉదయం సంతృప్తిగా మేల్కొవడానికి సహాయపడుతుంది.
ప్రతి రోజు రాత్రి 7-9 గంటల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఆరోగ్య శ్రేయస్సుకు కీలకమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Related Web Stories
చేప తలను తినవచ్చ తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా?
షుగర్ ఉన్న వారు తీసుకోవాల్సిన టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..
నెయ్యి డయాబెటిస్‌కు మంచిదా.. కాదా
నిద్ర లేవగానే ఇలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది..