కోపం గుండె ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిరంతరం కోపం కారణంగా.. ఒత్తిడి కాలక్రమేణా పెరుగుతూ పోతుంది. దీంతో మీ ఆరోగ్యం ప్రమాదంలో పడిపోతుంది.
దీనివల్ల గుండెపోటు లేదా గుండె జబ్బుల సమస్య వచ్చే అవకాశముంది.
కోపం వచ్చినప్పుడు.. శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్ల స్థాయి ఒక్కసారిగా పెరుగుతోంది. ఇవి రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతాయి. ఇది గుండెపై అధిక ఒత్తిడి కలిగిస్తుంది.
మీకు తరచుగా కోపం వస్తుంటే.. మీ మానసిక స్థితిపై శ్రద్ధ వహించాలని నిపుణులంటున్నారు.
కోపాన్ని, ఒత్తిడిని నియంత్రించడానికి యోగా, ధ్యానంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం వంటివి చేయాలి.
కోపం నియంత్రించు కోవడానికి యోగా,ధ్యానం చేయాలి. ఇది శరీరం, మనస్సులను ప్రశాంతంగా ఉంచుతోంది.
ప్రతి పరిస్థితిని సానుకూలంగా చూడాలి. శాంతంగా ఉండడం వల్ల హృదయానికి,శరీరానికి రెండింటికీ మంచిది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు వంటి సంతోషకర హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఒత్తిడితోపాటు కోపాన్ని తగ్గిస్తుంది.