ఆహార అలవాట్లలో భాగమైన  మఖానాలో పోషకాలు  పుష్కలంగా ఉంటాయి.

 ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు  వీటి నుంచి శరీరానికి అందుతాయి

ఈ సూపర్‌ఫుడ్‌ ఇప్పుడు ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ల డైట్‌గా మారింది.

మఖానాతో పాయసం చేసుకోవచ్చు. కూరా వండుకోవచ్చు...

ఎలా తిన్నా ప్రయోజనాలు మాత్రం బోలెడు.

మఖానాతో బెల్లం తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

బెల్లం, మఖానా కలిపి తినడం వల్ల ఎముకలు బలపడతాయి కీళ్ల, ఎముకల నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

మఖానా, బెల్లం రెండింటిలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది