పటిక లేదా ఆలమ్‌‌కు పలు  ఔషధ గుణాలు ఉన్నాయి.

దీని శాస్త్రీయనామం పొటాషియం అల్యూమినియం సల్ఫేట్. పటిక నీటితో స్నానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

పటిక నీటితో చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మం మీద చారలు, ముడతలు తొలగిపోతాయి.

ఈ నీటికి బాక్టీరియా నిరోధక లక్షణాలు కూడా ఉండటంతో చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రావు. చర్మం ఆరోగ్యం బాగుంటుంది

శరీర దుర్వాసనకు కారణమయ్యే బాక్టీరియాను కూడా పటిక నీరు నిరోధిస్తుంది. దీంతో, శరీర దుర్వాసన సమస్య తొలగిపోతుంది.

ఎగ్జీమా, డెర్మటైటిస్ వంటి వ్యాధుల కారణంగా తలెత్తే దురదల నుంచి కూడా పటిక నీటితో ఉపశమనం ఉంటుంది

మొటిమల నుంచి ఉపశమనానికీ దీన్ని ఉపయోగిస్తారు.

పటిక కారణంగా చర్మం బిగుతుగా మారితే మొటిమలు ఎండిపోయి త్వరగా నయమవుతాయి