అల్పాహారంగా
అరటిపండ్లు తింటే లాభాలు..
రోజూ ఉదయాన్నే అల్పాహారంలో అరటిపండ్లు తినడం వల్ల బోలెడు ప్రయోజనాలుంటాయి.
అరటిపండ్లలో డైటరీ ఫైబర్ ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
కార్బోహైడ్రేట్స్, సహజ చక్కెరలు ఉండటం వల్ల ఉదయాన్నే అరటిపండ్లు తింటే మంచి శక్తి లభిస్తుంది.
అరటిపండ్లలో ఉండే ట్రెప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సెరోటినిన్‍గా మార్పు చెందుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పొటాషియం, విటమిన్-సి, విటమిన్-బి6, డైటరీ ఫైబర్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటి కారణంగా రోజు ఉత్సాహంగా మొదలవుతుంది.
అరటిపండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది. ఇవి చక్కెరలను నెమ్మదిగా విడుదల చేస్తాయి.
Related Web Stories
జామ ఆకుల టీ తాగడం వల్ల కలిగే లాభాలివే..
రాగి సూప్ ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసా..
బ్రౌన్ రైస్ vs బ్లాక్ రైస్: ఆరోగ్యానికి ఏది మంచిది?
జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఈ విత్తనాలు తీసుకోండి