పాలతో ఈ పదార్థాలను కలిపి  తీసుకుంటే ఇన్ని లాభాలా..

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే కొన్ని పదార్థాలు పాలతో కలిస్తే వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.

పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకంటే శరీరంలో వాపులు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

చియా గింజలను పాలతో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు శక్తి లభిస్తుంది.

పాలలో ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే గొంతు చికాకుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు కలిపిన పాలను గోల్డెన్ మిల్క్ అంటారు. పసుపులో ఉండే కర్కుమిన్ బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తుంది.

పాలలో ఒకచెంచా పీనట్ బటర్ కలిపి తాగితే పోషక విలువలు పెరుగుతాయి.