చలికాలంలో  ఈ జాగ్రత్తలు తీసుకోండి..

చలికాలంలో ఇన్‌ఫ్లూయెంజా, ఫ్లూ వైరస్‌, రైనో వైరస్‌ దాడి చేసే ప్రమాదముంది.

ఈ వైరస్‌ ఆస్తమా, సీవోపీడీ, న్యుమోనియా ఉన్న వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ  కాలంలో శరీరంలో తేమ శాతం తగ్గిపోవడంతో దురదలు వస్తాయి.

చలికాలంలో  కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపే స్నానం ముగించాలి. 

కాళ్లకు చెప్పులు లేకుండా నడవొద్దు.

చేతులు, కాలి పాదాలు పగిలితే రోజూ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పువేసి అందులో కొద్దిసేపు ఉంచండి.

తర్వాత పాదాలను శుభ్రంగా పొడిబట్టతో తుడిచి మర్ధన చేస్తే పగుళ్లు తగ్గుముఖం పడతాయి.

 అరచేతులు, వేళ్ల సందుల్లో పగుళ్లు ఉంటే ఇదే పద్ధతి పాటించడం మంచిది.