రక్తంలోని చెడు కొలస్ట్రాల్‌ను కరిగించడంలో ములక్కాడలు కీలక పాత్ర పోషిస్తాయి. తద్వారా గుండె సంబంధ సమస్యల నుంచి కాపాడతాయి.
మునగాకు రసంలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మునగ ఆకుకు ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి.
కాలేయంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో ములక్కాడలు సమర్థంగా పని చేస్తాయి. తద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కిడ్నీలోని రాళ్లతో బాధపడుతున్న వారు తరచుగా ములక్కాడలు తింటే మంచిది.
బాలింతలు ములక్కాడలు తింటే పిల్లలకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి.
ములక్కాడలు రక్తంలోని మలినాలను బయటకు పంపి కిడ్నీల మీద ఒత్తిడిని తగ్గిస్తాయి.