శరీరంలో విటమిన్ E లోపం ఎందుకొస్తుందొ తెలుసా?.. గుర్తించేందుకు ముఖ్య సంకేతాలు ఇవే!
విటమిన్ E లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. విటమిన్ E అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం అత్యంత సాధారణ కారణం.
దీనితో పాటు దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్,సెలియాక్ వ్యాధి వంటి కొన్ని వ్యాధులు విటమిన్ E ని గ్రహించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
విటమిన్ ఇ లోపం లక్షణాలు ఒకేసారి బయటపడవు. క్రమక్రమంగా శరీరం సాధారణ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం లేదా శక్తి తక్కువగా ఉండటం.
చర్మం పొడిగా, నిర్జీవంగా మారడం. త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనిపించడం.
శరీరం సులభంగా ఇన్ఫెక్షన్లకు లోనవుతుంది. రోగనిరోధకశక్తి తగ్గడమే ఇందుకు కారణం.
శారీరక, మానసిక అభివృద్ధి ప్రభావితం కావచ్చు. ముఖ్యంగా పిల్లలలో పెరుగుదల మందగిస్తుంది.
తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని నివారించండి.ముఖ్యంగా మీకు ఏదైనా జీర్ణ వ్యాధి ఉంటే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.