బంగాళదుంప రసం తాగితే
ఈ సమస్యలు ఇక మటుమాయమే..
అత్యధిక పోషకాలున్న కూరగాయాల్లో బంగాళదుంప ఒకటి. దీనిలో అనేక రకాల పోషకాలున్నాయి.
ఈ బంగాళదుంప రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇందులో విటమిన్ బి మరియు సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్ పుష్కలంగా ఉంటాయి
బంగాళాదుంపలను తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
వాటిని జ్యూసర్‌లో వేసి రసం తీయాలి. దీనిలో ఏం కలపకుండా తాగడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బంగాళాదుంప రసంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్, ఇతర కీళ్ల సంబంధిత సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కల్పించడంలో సహాయపడుతుంది
అలుగడ్డల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి.. మలబద్ధకం, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అలుగడ్డ రసం కాలేయం, పిత్తాశయాన్ని శుభ్రపరిచే డిటాక్స్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది.
వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
కిడ్నీ సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తింటే ...
మీ నాలుక పై ఈ లక్షణాలు ఉంటే ?
మధుమేహం ఉన్నవారికి అలర్ట్.. వర్షాకాలంలో వచ్చే ఈ సమస్యతో పెద్ద ముప్పే..!
వర్షాకాలంలో విటమిన్ D పొందాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోవాల్సిందే..