గాడిద పాలు ఆరోగ్యానికి మంచిదేనా?

ప్రస్తుత కాలంలో గాడిద పాలకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంటోంది.

ఈ పాలు మార్కెట్‌లో, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి.

గాడిద పాలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

గాడిద పాలు మంచి మాయిశ్చరైజర్. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో గాడిద పాలు అద్భుతంగా పని చేస్తాయి.

అలర్జీని దూరం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఆర్దరైటీస్‌, దగ్గు, జలుబు లాంటి ఇన్‌ఫెక్షన్‌లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలను ఉపయోగిస్తారు.

ఆవుపాలతో పోలిస్తే గాడిద పాలల్లో 5 రెట్లు తక్కువ కెసిన్‌, సమాన స్ధాయిలో ప్రోటీన్‌లు కలిగి ఉంటాయి.

వీటితో సౌందర్య ఉత్పత్తులైన స్కిన్‌ క్రీమ్‌లు, ఫేస్‌ మాస్కులు, సబ్బులు, షాంపుల తయారీలో వాడతారు.