పెరుగు భారతీయులకు భోజనంలో బాగా అలవాటైన పదార్థం.

 భోజనం అంతా చేసాకా చివర్లో కమ్మని పెరుగుతో భోజనం పూర్తిచేయకపోతే అసలు భోజనం తినని ఫీలింగ్ కలుగుతుంది కొందరికి.

అయితే పెరుగును ఈ మధ్య కాలంలో ప్యాకెట్స్ రూపంలో వస్తున్నవి తీసుకుంటూ ఉన్నాం.

అయితే సాంప్రదాయంగా ఇండ్లల్లో తోడు వేసుకుని తిన్న పెరుగు చాలా కమ్మని వాసనతో, కమ్మని రుచితో తినేందుకు ఇష్టంగా ఉంటుంది.

ఈ పెరుగును శీతాకాలంలో ఎలా తోడు వేసకోవాలి. చల్లని ప్రదేశాల్లో పెరుగును ఎంతసమయం తోడు వేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఈ సీజన్‍లో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా పెరుగు సరిగా తోడుకోదు.

శీతాకాలంలో పెరుగుతోడుకోవడానికి 12 గంటల సమయం తీసుకుంటుంది. అదీ కాస్త వెచ్చని పాలలో మాత్రమే తోడు కలిపితే వెచ్చని ప్రదేశంలో ఉంచితే ఇది త్వరగా పేరుకుంటుంది.