సమ్మర్‌లో ఈ ఒక్క డ్రింక్ తాగండి.. కూల్ కూల్ అయిపోతారు
వేసవిలో అధిక ఎండల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో డీహైడ్రేషన్, వడదెబ్బ, అలసట వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మజ్జిగ తాగడం చాలా మంచిది. శరీరాన్ని చల్లబరిచే సహజమైన డ్రింక్ మజ్జిగ. ఇది తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో శరీరం వేడిగా ఉంటుంది. దీంతో శరీరం లోపలి ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఆ సమయంలో మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేసవిలో రోజుకు కనీసం ఒకసారి మజ్జిగ తాగితే..వేడి నుంచి రక్షించుకోవచ్చు.
ఎండ తీవ్రంతో ఉన్నప్పుడు శరీరంలో ముఖ్యమైన లవణాలు తగ్గిపోతాయి. ఫలితంగా వడదెబ్బ సమస్య తలెత్తుతుంది.మజ్జిగలో సహజ లవణాలు ఉంటాయి. ఇవి శరీరానికి అందుతాయి.
వేసవిలో చెమట కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గుతోంది. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది.మజ్జిగ తాగితే శరీరానికి తగినంత తేమ అందుతుంది.
మజ్జిగ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. వీటిలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి జీర్ణ సమస్యలను తగ్గిస్తోంది.
మలబద్ధకం,అజీర్ణం,గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మజ్జిగ తక్కువ కేలరీలు కలిగిన తేలికపాటి డ్రింక్. ఇది ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది.
మజ్జిగలో విటమిన్ C, కాల్షియం, ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మజ్జిగ.. శరీరానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. మజ్జిగలో ఉండే సహజ పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరిచేలా పనిచేస్తాయి.
మజ్జిగ తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి వ్యాధుల బారినపడే అవకాశాలు తగ్గుతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలంటే మజ్జిగను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మంచిది.
ఎండకాలంలో చర్మం పొడిబారడం, ముడతలు పడటం, బలహీనపడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. మజ్జిగ తాగడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది.
మజ్జిగలోని కాల్షియం.. ఎముకలను బలంగా మారుస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. ఇవి తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు.