ప్రతి రోజు అరటిపండు తింటే ఏం జరుగుతుందో తెలుసా..

 తక్కువ టైంలో ఎక్కువ శక్తిని ఇవ్వటంలో అరటిపండుకు సాటి లేదు. అలాంటి అరటిపండు కారణంగా ఆరోగ్య పరంగా మనకు చాలా లాభాలు ఉన్నాయి.

 మలబద్దకంతో ఇబ్బందిపడేవాళ్లు రోజుకు ఒక అరటిపండు తింటే అంతా సెట్ అవుతుంది.

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఆ పొటాషియం కారణంగా రక్త పోటు అదుపులో ఉంటుంది.

అరటి పండులో ఉండే ట్రైఫ్టోఫాన్ అనే అమినోయాసిడ్ కారణంగా మన శరీరంలో సెరోటనిన్ ఉత్పత్తి జరుగుతుంది.

ఈ సెరోటనిన్ కారణంగా మనకు ఒత్తిడి నుంచి రిలీఫ్ దొరుకుతుంది.

అరటిపండులో మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి. వీటి కారణంగా ఎముకలు దృఢంగా తయారు అవుతాయి.