వెన్నునొప్పితో బాధపడుతున్నారా..  ఈ చిట్కాలు పాటిస్తే బెటర్..

కంప్యూటర్‌ల ముందు, మంచాలపై ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కోర్ కండరాలు బలహీనపడతాయి. 

 దీనితో వెన్నెముక డిస్క్‌లు దెబ్బతింటాయి. 

దీన్ని ఎదుర్కోవడానికి, దినచర్యలో శారీరక శ్రమను చేర్చడం చాలా అవసరం.

యోగ, పిలేట్స్, స్విమ్మింగ్ వంటి వెన్ను, కోర్ని బలోపేతం చేసే వ్యాయామాలు వెన్నుముక ఆరోగ్యంలో సహకరిస్తాయి.

ఎక్కువ సేపు స్క్రీన్‌లపై వంగి కూర్చోవడం వెన్నెముకపై ప్రభావం కలిగిస్తుంది.

దీన్ని నివారించడానికి, కూర్చున్నప్పుడు లేదా నిలబడి శరీరాన్ని సాగదీయం చేయాలి.

ఎర్గోనామిక్ వర్క్‌స్టేషన్‌లు వీపు, మెడపై ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

 స్క్రీన్ సమయం నుండి క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి.

ఇలాంటి జాగ్రత్తలతో వెన్ను నొప్పి మరీ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.