ఫోన్ ఛార్జింగ్ త్వరగా  అయిపోతోందా..  ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువ పెట్టి వాడుతుంటారు. 

బ్రైట్‌నెస్ ఎక్కువగా పెట్టుకోవడం కళ్లకు కూడా హాని చేస్తుంది. బ్రైట్‌నెస్‌ని ఆటో మోడ్‌లోఉంచడం ద్వారా బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది.

బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ యాప్‌లు రన్ అవుతూ బ్యాటరీని చాలా వినియోగిస్తాయి. 

కాబట్టి, మీకు అవసరమైన అప్లికేషన్‌లను మాత్రమే డిస్‌ప్లే‌పై ఉంచుకుని.. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న అన్ని యాప్‌లను మూసివేయండి.

చాలా సార్లు స్మార్ట్‌ఫోన్‌లో ఆటోఅప్‌డేట్ సెట్టింగ్ ఆన్‌లో ఉంటుంది. ఆటో-అప్‌డేట్ కారణంగా, యాప్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంటాయి. 

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ జీవితకాలాన్ని పెంచాలనుకుంటే, వెంటనే ఆటో అప్‌డేట్ సెట్టింగ్‌ను నిలిపివేయండి.

మీ ఇంట్లో Wi-Fi కనెక్షన్ ఉంటే దాన్నే ఉపయోగించండి. 

Wi-Fi కనెక్షన్‌ని ఉపయోగించడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీ జీవిత కాలాన్నిపెంచుకోవచ్చు.