ఉప్పు ఎక్కువగా
తినే వారు జాగ్రత్త!...
ఉప్పు ఎక్కువ తింటే బీపి పెరగడం అందరికీ తెలిసిందే. కానీ బీపీ పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు కిడ్నీ పనితీరును దెబ్బతీస్తాయి.
కిడ్నీ డ్యామేజ్‍కు దారితీస్తాయి.
ఎక్కువ ఉప్పు తింటే మూత్రం ద్వారా కాల్షియం నష్టానికి దారితీస్తుంది. ఇది ఎముకల బలహీనత, బోలు ఎముకల వ్యాధికి కారణమవుతుంది.
ఉప్పు ఎక్కువ తింటే మెదడు పనితీరు మందగిస్తుంది. మానసిక సమస్యలకు కారణం అవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ఉప్పు ఎక్కువ తింటే శరీరంలో నీరు ఎక్కువగా నిలుస్తుంది.
ఇది కడుపు ఉబ్బరం, శరీరంలో వాపులకు దారి తీస్తుంది.
ఉప్పు ఎక్కువ తింటే శరీర కణాలు బ్యాలెన్సింగ్ కోసం నీటిని పీల్చుకుంటాయి. ఇది శరీరం డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.
ఉప్పు ఎక్కువ తింటే కడుపులో ఉండే సున్నితమైన పొరలు చికాకుకు గురవుతాయి. జీర్ణాశయం దెబ్బతింటుంది.
Related Web Stories
అనారోగ్యాన్ని దూరం చేసే అద్భుత ఆకు..
జీర్ణక్రియ బాగుండాలంటే.. ఈ పండ్లు తినండి చాలు..
కాళ్లపై కనిపించే అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు..
ఖాళీ కడుపుతో వాల్నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?