కొన్ని పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

అరటిపండులోని నీరు, ఫైబర్, పొటాషియం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ ప్రొటీన్లను విచ్చిన్నం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బెర్రీల్లోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పేగు ఆరోగ్యంతో పాటూ జీర్ణక్రియ బాగుండేలా చేస్తాయి.

కివి పండ్లలోని ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటూ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఆపిల్ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియతో పాటూ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అవకాడోలోని ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

మామిడి పండ్లలోని ఫైబర్, అమైలేస్ సమ్మేళనాలు జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తాయి. 

రోజూ పండిన జామ పండ్లను నల్ల ఉప్పుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.