అరటిపండును పాలతో తినడం ఇష్టమా.. ఇదెంత చెడ్డ అలవాటంటే..

పాలు, అరటిపండు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది.

దీని వల్ల కడుపులో భారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. 

జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. అందుకే పాలు, అరటిపండు కలిపి తీసుకోకూడదు.

ఆయుర్వేదం ప్రకారం పాలు, అరటిపండు కలిపి తీసుకుంటే శరీరంలో విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయట.

పైగా ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కఫం, అలర్జీ, జలుబు వంటి సమస్యలు కూడా వస్తాయట.

అరటిపండు ఒకటే తిన్నా ఆరోగ్యం, పాలు తాగినా ఆరోగ్యం.

కానీ ఈ రెండూ కలిపితే రెండింటిలో కేలరీలు కలసి శరీరానికి ఎక్కువ కేలరీలు సరఫరా చేస్తాయి.

ఈ కారణంగా పాలు, అరటిపండు తినేవారు ఈజీగా బరువు పెరుగుతారు.