ఇవి అలవాటు చేసుకుంటే చాలు..  పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది..

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే తల చర్మం ఆరోగ్యంగా ఉండాలి.

ముఖ్యంగా తల చర్మంలో రక్త ప్రసరణ బాగుండాలి.

దీనికోసం స్కాల్ప్‍కు రెగ్యులర్‍గా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. 

ఇది జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. 

జుట్టు పెరుగుదలకు సహాయపడే నూనెలను వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

జుట్టును ఆరోగ్యంగా ఉంచే హెయిర్ స్టైల్స్‍ను ఫాలో అయితే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

జుట్టు చివర్లను ప్రతి 6 నుండి 8 వారాలకు ఒకసారి ట్రిమ్ చేస్తుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది.

తలస్నానం చేయడానికి రసాయనాలు లేని తేలికపాటి షాంపూని ఉపయోగించాలి.

తలస్నానం చేయడానికి గంట ముందు తలకు ఆయిల్ పెట్టడం మంచిది.