మేకప్ లేకపోయినా అందంగా
కనిపించాలని అందరికీ ఉంటుంది.
మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. చర్మంలో సహజ మెరుపును తీసుకువస్తుంది.
ముల్తానీ మట్టితో స్నానం చేస్తే చర్మం, జుట్టుకు సహజ మెరుపుతో పాటు చాలా ప్రయోజనాలను అందిస్తుంది.
సగం బకెట్ నీటిలో మూడు కప్పుల ముల్తానీ మట్టి పొడి, 2 చెంచాల శనగపిండి, అర చెంచా పసుపు కలిపి స్నానం కోసం ఆ నీటిని వాడండి.
ముల్తానీ మట్టితో స్నానం చేయడం అంటే మీరు మట్టి నీటితో స్నానం చేయాలి. అంటే మొదట మీరు ఆ నీటితో శరీరాన్ని పూర్తిగా తడపండి.
మట్టిని కొంతసేపు శరీరానికి పట్టించుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి తొలగించడంతో పాటు రంధ్రాలను తెరుస్తుంది.
చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది. మీరు వారానికి 2 నుండి 3 రోజులు ముల్తానీ మట్టితో స్నానం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ముల్తానీ మట్టి ప్యాక్ వేసిన తర్వాత గంటల సమయం వేచివుండకూడదు. స్నానం చేసిన కొద్దిసేపటి తర్వాత మళ్లీ శుభ్రమైన నీటితో స్నానం చేయాలి.
Related Web Stories
అరటిపండును పాలతో తినడం ఇష్టమా.. ఇదెంత చెడ్డ అలవాటంటే..
పెసర మొలకలు తింటే.. ఈ సమస్యలున్న వారికి నష్టం తప్పదు..
ఇవి అలవాటు చేసుకుంటే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది..
మీ జుట్టుకు ఈ పదార్థాన్ని తగలనిచ్చారో ఇక అంతే