క్యారెట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ లో బీపీ సమస్యను పోగొట్టేందుకు ఉపయోగపడుతుంది.
తక్కువ రక్తపోటు ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అవసరం. కాబట్టి, ఉప్పు నీరు తాగితే మంచిది. కానీ, అధికంగా తాగటం మంచిది కాదని గుర్తుంచుకోండి.
బీట్‌రూట్ రసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సహా అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు రక్తపోటు పెంచేందుకు సాయపడతాయి.
రక్తపోటు పెరిగేందుకు బాదం కలిపిన పాలు తాగితే ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెండింటిలో శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలున్నాయి.
రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు తరచూ కాఫీ తాగడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే కాఫీ తాగితే రక్తపోటు పెరుగుతుంది.