మీరు వాడే టూత్ బ్రష్ తరచూ మారుస్తున్నారా.. లేదా..  లేకుంటే వేరీ డేంజర్

చాలా మంది నెలల తరబడి ఒకే బ్రష్‌ను వాడుతోంటారు. ఇది సరైన పద్ధతి కాదని దంత వైద్యులు సూచిస్తున్నారు. 

బ్రష్‌లు అరిగిపోయిన తర్వాత కూడా వాటిని చాలా మంది ఉపయోగిస్తారని వారు చెబుతున్నారు. కానీ ఈ విధంగా బ్రష్‌ల‌ను ఉపయోగించకూడదు.

నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే కేవలం పళ్ళు తోముకోవడం మాత్రమే కాదు. నోటి ఆరోగ్యం కోసం చాలా మంది సాల్టెడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకుంటారు.

కానీ అసలు సమస్య వేరే ఉంది. నోటి ఆరోగ్యం చాలా వరకు టూత్ బ్రష్ మీద ఆధారపడి ఉంటుందని దంత వైద్యులు పేర్కొంటున్నారు.

చాలా మంది రోజుల తరబడి ఒకే బ్రష్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ పద్ధతి సరైనది కాదు.

కనీసం ప్రతి మూడు నెలలకు ఒక సారి బ్రష్‌లను మార్చాల్సి ఉంది. బ్రష్‌లు అరిగిపోయిన తర్వాత కూడా చాలా మంది వాటిని ఉపయోగించడం కొనసాగిస్తారు. ఈ విధంగా చేయవద్దని సూచిస్తున్నారు.

ఏదైనా అంటు వ్యాధి నుండి కోలుకున్న అనంతరం మీ టూత్ బ్రష్‌ను మార్చాల్సి ఉంది. ఎందుకంటే ఆ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా లాలాజలంలో ఉండి.. బ్రష్‌లోని పొడవైన కమ్మీలలో  అధిక కాలం ఉంటుంది.

వాటి నుంచి ఆ వ్యాధి మళ్ళీ వ్యాపించే అవకాశముంది. దంతాల వెలికితీత తర్వాత లేదా నోటి లోపల ఏ రకమైన శస్త్రచికిత్స జరిగినా.. ఆ తర్వాత మీ టూత్ బ్రష్‌ను ఖచ్చితంగా మార్చడం మంచిది.

మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ బ్రష్‌ హెడ్‌లను ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలని దంత వైద్యులు సూచిస్తున్నారు.