పరగడుపున ఈ ఆహారాలు అస్సలే  తినొద్దు... తింటే జరిగేదిదే!

పరగడుపున మనం ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు

ఖాళీ కడుపుతో ఈ ఆహారాన్ని తీసుకుంటే గుండెల్లో మంటగా ఉంటుంది. ఇది మనకు ఇబ్బందిని కలిగిస్తుంది.

 పరగడుపున  పుల్లగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. నిమ్మ, నారింజ వంటి వాటిని పరగడుపున తీసుకుంటే గ్యాస్ సమస్య వస్తుంది.

పరగడుపున ఎలాంటి ఆహారం తినకుండా కాఫీ, టీలు తాగితే కూడా ఎసిడిటీ సమస్య వస్తుంది.

పరగడుపున పొరపాటున కూడా తీపి పదార్థాలు తీసుకోకూడదు.

పొరబాటున కూడా పరగడుపున టిఫిన్ తో పాటు నిల్వపచ్చళ్ళు తీసుకోకూడదు.

పరగడుపున చాలా లైట్ గా సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిది