వీళ్ళు బీరకాయ ఎట్టి పరిస్థితుల్లో  తినకూడదు..

బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి

బీరకాయ కూరను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే, కొందరు మాత్రం బీరకాయకు దూరంగా ఉండాలి.

సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు బీరకాయకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి వారు బీరకాయ తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అలెర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా బీరకాయ పట్ల జాగ్రత్త వహించాలి. కొందరికి బీరకాయ పడకపోవచ్చు.

ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు కూడా బీరకాయ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

బీరకాయలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, గర్భిణీ స్త్రీలు దీనిని పెద్ద పరిమాణంలో తినకూడదు.