గంజి తాగడం వల్ల ఇన్ని లాభాలా..?

ఆకలి తీరడానికి అన్నం తింటాం. కానీ అన్నం వండే క్రమంలో లభించే గంజి తాగడం వల్ల శరీరానికి అనేక లాభాలున్నాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. 

గంజి విలువ తెలియక చాలా మంది వాటిని పాడేస్తున్నారు. కానీ ఈ గంజి కేవలం ఆహార పదార్థం కాదని.. పిల్లల ఆరోగ్య జీవితాలను మార్చే శక్తి దీనికి ఉందని చెబుతున్నారు. 

గంజి తాగడం.. అన్నంలో కలుపుకుని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.

వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రోజు వారీ కార్యకలాపాలకు శక్తిని అందిస్తాయి.

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

కేవలం బియ్యంతోనే కాదు.. మొక్కజోన్న, గోధుమలు, మిల్లెట్స్ తదితర తృణధాన్యాలతో గంజిని చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన గంజిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

శరీర చర్మాన్ని గంజి మృదువుగా ఉంచుతుంది. చర్మాన్ని యవ్వనంగా మిలమిల మెరిసేలా చేస్తుంది. చర్మ వ్యాధులను సైతం తగ్గిస్తుంది.

శరీరక, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

జర్వం వచ్చినప్పుడు గంజిని తీసుకోవడం వల్ల దాని తీవ్రత బాగా తగ్గుతుంది.

మజ్జిగ లేకుంటే.. గంజిని అన్నంలో వేసుకుని తినండి. ఇలా చేయడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గించి.. చల్లగా అయ్యేలా చేస్తుంది.

ప్రతి ఏడాది అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ గంజి దినోత్సవంగా జరుపుకుంటారని చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.