కొంతమందికి చర్మంపై తరచుగా ఎర్రటి దద్దుర్లు, దురదగా ఉంటుంది

కొంతమంది దీనిని  పట్టించుకోరు. కానీ వైద్యులు ఇది సోరియాసిస్ అని చెబుతుంటారు

క్రమంగా శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఎవరికైనా అలాంటి సమస్య ఉంటే దానిని తేలికగా తీసుకోవద్దు.

వెంటనే వైద్యులను సంప్రదించిఆహారంలో మార్పులు చేయడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. 

ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. కానీ కంట్రోల్‌ చేయవచ్చు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. 

శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఇది వస్తుంది. 

శీతాకాలంలో సోరియాసిస్ కేసులు ఎక్కువగా వస్తాయిఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది.

సోరియాసిస్ రాకుండా ఉండాలంటే చర్మం పొడిబారకుండా చూసుకోవాలి.

చర్మంపై మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. ఎక్కువగా మద్యం లేదా పొగ తాగితే తగ్గించండి.