రోజూ పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పెరుగులోని ప్రోబయోటిక్స్, ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు శరీరానికి మేలు చేస్తాయి. 

పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరడంలో పెరుగు సాయం చేస్తుంది. 

జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంలో సాయం చేస్తుంది. 

బరువు నియంత్రణలో ఉంచడంలో పెరుగు బాగా పని చేస్తుంది. 

పెరుగులోని పొటాషియం కంటెంట్.. రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పెరుగు సహకరిస్తుంది. 

ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో పెరుగు సాయం చేస్తుంది.

పెరుగులోని విటమిన్లు, ఖనిజాలు.. చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.