రాత్రి పడుకునే ముందు  ఈ పనులు చేస్తే..

ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. కాబట్టి, అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పడుకునే ముందు పుస్తకం చదవడం లేదా డైరీ రాయడం వల్ల మీకు నిద్ర బాగా పడుతుంది.

మంచి నిద్ర కోసం ప్రతిరోజు లైట్లు ఆఫ్ చేసి పడుకోండి. అలాగే, మృదువైన సంగీతాన్ని కూడా వినవచ్చు.

పగటిపూట కొద్దిసేపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల రాత్రిపూట మీ నిద్రపై ప్రభావం పడుతుంది.

 కెఫీన్ మీ ఏకాగ్రత, శక్తిని పెంచుతుంది. కాబట్టి, నిద్రపోయే ముందు టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి తాగకపోవడమే మంచిది.