ఆయుర్వేదంలో పచ్చి పసుపు ప్రాధ్యాన్యం అంతా ఇంతా కాదు. పసుపును వంటలో, సౌందర్య సాధనాలతోపాటు పూజా కార్యక్రమాల్లో కూడా ఉపయోగిస్తారు'
పచ్చి పసుపులో కర్కుమిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
పచ్చి పసుపును రోజూ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. బరువును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది
పచ్చి పసుపు, అల్లం గ్రైండ్ చేసి టీ తయారు చేసుకుని రోజూ ఉదయాన్నే తాగితే కొవ్వు త్వరగా కరిగిపోయి బెల్లీ ఫ్యాట్ తగ్గుముఖం పడుతుంది.
మొటిమల సమస్యతో బాధపడే వారు పచ్చి పసుపు తింటే తీవ్రత తగ్గుతుంది.
పచ్చి పసుపు, తేనె, పంచదార కలిపి కళ్ల కింద రాసుకుంటే కళ్ల కింద రక్త ప్రసరణను ప్రేరేపించి నల్ల వలయాలను నివారిస్తుంది.
పసుపును చూర్ణం చేసి, సాధారణ ఆలివ్ నూనెతో కలిపి నొప్పి, వాపు ఉన్న చోట పూస్తే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.
Related Web Stories
శీతాకాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారాలు
ఈ కాయతో మధుమేహం కంట్రోల్.. చీప్ అండ్ బెస్ట్..
ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తారు! దీనికి అసలు కారణం ఏమిటి..
చలికాలంలో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు దూరం..