ఈ కాయతో మధుమేహం కంట్రోల్
మారేడు పండులో అనేక ఔషధగుణాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఈ మారేడు పండు అతిసార వ్యాధికి మంచిది.
మారేడు రసంలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్త సంబంధ ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
ఈ పండులో కంటే లేత కాయలో అధిక ఆరోగ్య గుణాలు కలిగి ఉంటాయి.
మారేడు పండు జ్యూస్‌తో అజీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్, పేగు పూత తదితర సమస్యలు తొలగిపోతాయి.
కడుపు నొప్పి, నీరసం, నిస్సత్తువను నియంత్రిస్తుంది. ఇంకా చెప్పాలంటే అమీబియాసిస్‌ను మారేడు కాయ నిరోధిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది.
వేసవి కాలంలో మారేడు పండు రసాన్ని తాగితే చలువ చేస్తుంది.
మారేడు ఆకుల రసం మధుమేహాన్ని నియంత్రిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలును కంట్రోల్ చేస్తుంది.
బిల్వ ఆకుల కషాయంలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
మారేడు చెట్టు పండ్లు, కాయలు, బెరడు, వేళ్లు, ఆకులు, పువ్వులు అన్ని కూడా ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగపడతాయి.
Related Web Stories
ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తారు! దీనికి అసలు కారణం ఏమిటి..
చలికాలంలో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు దూరం..
పుచ్చకాయ గింజలతో ఇన్ని లాభాలున్నాయా?..
పచ్చిమిర్చి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే...