వర్షాకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు  వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా అంటువ్యాధులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ A, E లాంటివి ఎక్కువగా వస్తాయి.

వర్షాకాలంలో దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

గాలిలో తేమ పెరగడం వల్ల ఫంగస్ వేగంగా పెరుగుతుంది, దీనివల్ల ఆస్తమా, అలర్జీలు, ఫ్లూ, జ్వరం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఈ కాలంలో చిన్న గాయాలు కూడా త్వరగా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.

మరిగించిన నీళ్లు మాత్రమే తాగాలి,బయట ఫుడ్ తినడం మానేయండి,పాత లేదా పాడైన ఆహారం తినవద్దు, దోమల నివారణకు చర్యలు తీసుకోండి.

శరీరం పూర్తిగా కప్పబడిన బట్టలు వేసుకోండి, పరిశుభ్రతను ఎప్పుడూ పట్టించండి, చెప్పులు లేకుండా బయటికి వెళ్ళవద్దు.