కొల్లాజెన్ అనే ప్రొటీన్ చర్మాన్ని మృదువుగా ముడతలు లేకుండా చేస్తుంది. ఈ ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచాలంటే..

విటమిన్ సీ అధికంగా ఉండే సిట్రస్ పండ్లు తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. 

కొల్లాజెన్ సప్లిమెంట్స్‌లోని హైడ్రోలైజ్డ్ పెప్టైడ్స్‌తో కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. 

రెటినాల్‌తో కొత్త కణాలు పుట్టుకొచ్చి కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది

చర్మంపై ఎర్రని కాంతిని ప్రసరించి చేసే రెడ్ లైట్ థెరపీ కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది

ప్రొటీన్ ఫుడ్‌ తింటే గ్లైసిన్, ప్రొలీన్‌ అమైనోఆమ్లాల లభ్యత పెరిగి కొల్లాజెన్ ఉత్పత్తి మెరుగవుతుంది

యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్‌తో కొల్లాజెన్‌పై ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది. 

సన్‌స్క్రీన్‌లు సూర్యరశ్మిలోని యూవీ కాంతిని అడ్డుకుని కొల్లాజెన్‌ దెబ్బతినకుండా కాపాడతాయి.