ఎర్ర జామ vs తెల్ల జామ..  ఆరోగ్యానికి ఏది మంచిది..?

ప్రతిరోజు ఒక జామకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మనకు రెండు రకాల జామకాయలు కనిపిస్తుంటాయి.

తెల్ల జామకాయ సాధారణంగా లేత ఆకుపచ్చ నుండి పసుపు రంగులో ఉంటుంది. లోపల తెల్లని గుజ్జుతో, గింజలు ఎక్కువగా ఉంటాయి.

వీటి రుచి కాస్త వగరుగా, తీపిగా ఉంటుంది. విటమిన్ C, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇందులో అధికం. సాధారణంగా వీటిని జెల్లీ, జామ్ తయారీకి ఉపయోగిస్తారు.

పింక్ జామకాయ లోపల గులాబీ రంగు గుజ్జు ఉంటుంది. వీటిలో విటమిన్ Cతో పాటు లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది.

షుగర్ పేషెంట్లకి రెండు రకాల జామలు మంచివే అయినప్పటికీ, తెల్ల జామకాయ మరింత మేలు చేస్తుంది.

తెల్ల జామలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరగకుండా చూస్తుంది.

పింక్ జామలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి.

గుండె ఆరోగ్యం, కంటి చూపు మెరుగుపరచడానికి పింక్ జామలో ఉండే లైకోపీన్, కెరోటినాయిడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

 మొత్తానికి ,జామకాయ ఏ రంగుదైనా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.