ఈ 9 లక్షణాలు కనబడుతున్నాయా.. కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..
కిడ్నీలు రక్తపోటును రెగ్యులేట్ చేస్తాయి. కిడ్నీలు పాడైతే రక్తపోటు విపరీతంగా పెరుగుతుంది.
కిడ్నీల పనితీరు దెబ్బతింటే కాళ్లలోకి నీరు చేరి పాదాలు, మడమలు వాచినట్టు కనబడతాయి.
కిడ్నీ డ్యామేజ్ కారణంగా ఊపిరితిత్తులలోకి నీరు చేరుతుంది. దాంతో ఊపిరి తీసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
డార్క్ కలర్‌లో, నురగతో కూడిన యూరిన్ వస్తుంటే కిడ్నీల పరీక్ష చేయించుకోండి..
కిడ్నీ డ్యామేజ్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీంతో ఎక్కువ సమయం పాటు నీరసంగా, అలసటగా అనిపిస్తుంది.
వీపు కింది భాగంలో, పక్క భాగంలో నొప్పి వస్తున్నా కిడ్నీ సమస్యగా భావించి పరీక్షలు చేయించుకోవాలి.
కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఫలితంగా చర్మం పొడిగా మారడం, దురద పుట్టడం జరుగుతుంది.
కిడ్నీ డ్యామేజ్ కారణంగా శరీరంలో మినరల్స్, ఫ్లూయిడ్స్ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా నిద్ర సరిగ్గా పట్టదు.
కిడ్నీ డ్యామేజ్ కారణంగా ఆకలి తగ్గడం, వికారంగా అనిపించడం జరుగుతుంది.
Related Web Stories
రాత్రంతా పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే ఎన్ని లాభాలో తెలుసా..
ఈ రైస్ తింటే బరువు తగొచ్చు తెలుసా..?
తాటి బెల్లం తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
అసిడిటీ వేధిస్తోందా ? ఇలా చేస్తే సమస్య పరార్..