అసిడిటీ వేధిస్తోందా ?  ఇలా చేస్తే సమస్య పరార్‌..

అసిడిటీ వచ్చిన తర్వాత చికిత్సలను ఆశ్రయించేకంటే, అసిడిటీ తలెత్తకుండా చూసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం...

అసిడిటీ మొదలైనప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఫలితం ఉంటుంది.

 అలాగే గ్లాసు నీళ్లలో పది పుదీనా ఆకులు వేసి, మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు, తేనె కలిపి తాగాలి.

నీళ్లలో స్పూను జీలకర్ర వేసి మరిగించి, చల్లారిన తర్వాత తాగాలి.

అసిడిటీ మొదలైన వెంటనే నోట్లో లవంగాలు వేసుకుని, నములుతూ రసం మింగుతూ ఉండాలి.

ఎండు ద్రాక్షను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తాగాలి.

తీయని దానిమ్మ, అరటిపళ్లు అప్రికాట్స్‌, కొబ్బరి అసిడిటీకి విరుగుడుగా పని చేస్తాయి.