తాటి బెల్లం తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
తాటి బెల్లం తయారీలో ఎటువంటి రసాయనాలను వినియోగించరు. దీనిలో అద్భుతమైన రుచి ఉంటుంది.
ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.
ఇది రక్తహీనతను నివారిస్తుంది. బెల్లంలోని ఐరన్ కంటెంట్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది.
ఈ బెల్లాన్ని పాలతో తీసుకుంటే.. కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది.
ఈ బెల్లాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇది పేగు కదలికలను నియంత్రిస్తుంది. మలబద్ధకం, అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
చాలా మంది పిల్లలు నోటి పూతలతో బాధపడుతుంటారు. ఆ పూతపై ఏలకులు, బెల్లం పొడి పూయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
నల్ల మిరియాలు, నెయ్యితో కలిపి ఈ బెల్లం తీసుకుంటే.. గొంతు నొప్పి తగ్గుతుంది.
తాటి బెల్లం తరచూ తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది.
తాటి బెల్లం మీ పొట్టను శుభ్రపరుస్తుంది. పేగులు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.