వేసవిలో చెరుకు రసం తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొన్ని సమస్యలున్న వారు దీనికి దూరంగా ఉండాలి.

చెరుకు రసం రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. మధుమేహ రోగులు దీనికి దూరంగా ఉండాలి.

చెరుకు రసంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తీసుకోకపోవడమే మంచిది.

చెరుకు రసం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, ఆమ్లతత్వం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు ఉన్న వారు దీనికి దూరంగా ఉండాలి.

దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్న వారు కూడా దీన్ని తీసుకోకపోవడమే మంచిది. 

చెరుకు రసం ప్రభావం తల్లి, బిడ్డపై తీవ్రంగా ఉంటుంది. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులు వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.