నవజాత శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం   వల్ల ఎన్ని లాభాలో తెలుసా..

ముర్రుపాలలో అధిక మొత్తంలో యాంటీబాడీలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఇవ్వడం వల్ల అప్పుడే పట్టిన బిడ్డకు మేలు జరుగుతోంది.

ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి నవజాత శిశువును కాపాడుతుంది. ఇవి ఆ నవజాత శిశువు పెరుగుదలతోపాటు అభివృద్ధికి చాలా అవసరమంటున్నారు.

పసి పిల్లలకు తొలుత పట్టించే ముర్రుపాలలో తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. అవి శిశువుకు సులభంగా జీర్ణమవుతాయి.

ముర్రుపాలు శిశువు, తల్లి మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచడానికి సహాయపడతుంది.

అందుకే ప్రతి తల్లి పుట్టిన వెంటనే తన బిడ్డకు ముర్రుపాలు పట్టించడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతారు. 

పుట్టిన పిల్లలకు ముర్రుపాలు తాగించటం వల్ల వారి మేధోశక్తి పెరుగుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి.

మొదటి పాలు నవజాత శిశువుకు ఒక అమూల్యమైన వరంగా చెబుతున్నారు.

సాధారణ పాల కంటే ముర్రుపాలలో భిన్నమైన పోషక విలువలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అప్పుడే పుట్టిన బిడ్డలో ముర్రుపాలు తాగడం వల్ల జీవిత కాలం వ్యాధి నిరోధకతను కలిగి ఉంటాడని పెద్దలు చెబుతారు.