షుగర్ పేషెంట్లు, అధిక బరువు ఉన్న వారు అన్నం తినాలంటే భయపడిపోతున్నారు. అన్నం తింటే శరీరంలో కార్పోహైడ్రేట్స్ పెరిగి బరువుతోపాటు షుగర్ లెవల్స్ పెరుగుతాయని టెన్షన్ పడుతున్నారు.
అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే.. షుగర్‌తోపాటు అధిక బరువును కంట్రోల్ చేయవచ్చు.
అన్నం వండేటప్పుడు.. అందులో కొన్ని బెండకాయ వేస్తే సరిపోతుంది. దీంత అన్నం త్వరగా ఉడకడమే కాకుండా.. ఔషధంలా పని చేస్తుంది.
బెండకాయల్ని ఉడికే అన్నంలో వేయడం వల్ల అందులో ఉండే సహజ జెల్.. బియ్యానికి చేరుతుంది.
బెండకాయల్లోని పోషకాలు, విటమిన్స్, ఫైబర్ అన్ని అన్నంలో కలుస్తాయి. ఇలా వండిన అన్నం తినడం వల్ల బాగా జీర్ణం అవుతుంది.
బెండకాయల్లోని ఫైబర్.. అన్నంలో కలిసినప్పుడు జీర్ణప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఇది చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచుతుంది.
ఈ అన్నం ప్రీ బయోటిక్‌గా పని చేసి పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
బెండకాయల్లో మెగ్నీషియం, ఫోలెట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, కె1 ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచడంతోపటు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి.