వంకాయతో కలిపి  పొరపాటున కూడా  ఇవి తినకూడదు

వంకాయ చాలా మంది వంటల్లో ఉపయోగించే కూరగాయ. దీనితో కూర చేస్తే ఆహా ఏమి రుచి అంటూ ఓ పట్టు పట్టాల్సిందే.

గుత్తి వంకాయ కూర గురించే అయితే పాటలే ఉన్నాయి. మసాల దట్టించి.. కూర చేసుకునే తింటే వచ్చే ఆ మజానే వేరు. 

ఈ రోజుల్లో వంకాయతో అనేక రెసిపీలు అందుబాటులో ఉన్నాయి.

వంకాయ కూర, వంకాయ బజ్జీ, వంకాయ మసాలా, వంకాయ పచ్చడి, గుత్తి వంకాయ బిర్యానీ ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి.

వంకాయ కూరతో తిన్న తర్వాత పెరుగు తింటుంటారు.  ఈ రెండు ఫుడ్స్ వ్యతిరేక స్వభావాలు కలిగి ఉంటాయి. 

పెరుగు చల్లటి స్వభావం కలిగి ఉంటుంది. అదే, వంకాయ వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది.

చాలా మంది టిఫెన్ లేదా భోజనం తర్వాత టీ తాగుతుంటారు. ఆ సమయంలో మీరు వంకాయ తిని ఉంటే మాత్రం టీ జోలికి వెళ్లద్దు

టీ అనేది టానిన్ రిచ్ ఫుడ్. వంకాయ తిన్న తర్వాత టీ తాగడం వల్ల పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది.