ప్రతి జీవి శరీరంలో నాడీ వ్యవస్థ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

మెదడుకు వివిధ రకాల సమాచారం అందించేందుకు నరాలు ఎంతో కీలకం.

శరీరంలో ఏ భాగం సరిగ్గా పని చేయాలన్నా నాడీ వ్యవస్థ సక్రమంగా ఉండాల్సిందే.

అందుకే నరాల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

నరాల ఆరోగ్యానికి విటమిన్ బి12, విటమిన్ బి6, విటమిన్ బి3, బి1 చాలా ముఖ్యం.

బి విటమిన్లు నరాల తిమ్మిర్లు, జలదరింపులు వంటి లక్షణాలను తగ్గిస్తాయి.

నడక, సైక్లింగ్ వంటివి తప్పనిసరిగా చేయడం ద్వారా నరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

తరచుగా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషకాహారాలు తీసుకోవాలి.

ఎందుకంటే అవి నరాల నొప్పులు, వాపులు తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకునేందుకు సైతం నరాల ఆరోగ్యం దోహదం చేస్తుంది.

కాబట్టి క్రమం తప్పకుండా సరైన నియమాలు పాటిస్తూ నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.