మనం రోజూ తినే కొన్ని సహజసిద్ధమైన ఫుడ్స్‌‌లో యాంటీబయాటిక్ గుణాలు ఉన్నాయి. అవేంటంటే..

దాల్చిన చెక్కలోని సహజసిద్ధ నూనెలు ఈకొలై బ్యాక్టీరియాను అడ్డుకుని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి

లవంగాల్లోని యాంటీమైక్రోబియల్ గుణాలు నోటి ఆరోగ్యానికి, నొప్పి నుంచి ఉపశమనానికి కీలకం

కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్‌కు యాంటీమైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి

వెల్లుల్లిలోని అలిసిన్ కూడా బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధించి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది

అల్లం కూడా ఇన్‌ఫ్లేమేషన్‌ను తగ్గించేందుకు, ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు అవసరం

తేనెలోని యాంటీమైక్రోబియల్ లక్షణాలతో గాయాలు త్వరగా నయమవుతాయి. 

ఉల్లిపాయల్లోని సల్ఫర్ కాంపౌండ్స్‌ కూడా ఇన్ఫెక్షన్‌లను అడ్డుకుని ఊపిరితిత్తుల్ని మెరుగుపరుస్తాయి

పసుపు కూడా సహజసిద్ధమైన యాంటీబయోటిక్‌యే. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది