మీ గోర్లు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి.

మీకు తగినంత పోషకాహారం అందడం లేదా మీ జీర్ణక్రియ సరిగా లేకపోవడం వంటివి గోర్ల ద్వారా తెలుసుకోవచ్చు.

మీ గోర్లు సాధారణంగా విరిగిపోవడం, రంగు మారడం వాటిపై వింత మచ్చలు కనిపించడం వంటివి కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

చేతులు ఎక్కువసేపు తడిగా లేదా పొడిగా ఉన్నప్పుడు గోర్లు పెళుసుగా మారడం సహజం.

తరచుగా ఇలా జరుగుతుంటే అది థైరాయిడ్ సమస్యలు, ఐరన్లోపానికి సంకేతం కావచ్చు.

ఈ సమస్యను నివారించడానికి పాత్రలు కడిగేటప్పుడు, నీటిలో పని చేసేటప్పుడు చేతి గ్లౌజులు ధరించడం, చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది.

మీ గోళ్లపై అడ్డంగా లేదా వంకరగా గీతలు ఉంటే అది సాధారణమే.

నిటారుగా ఉన్న గీతలు కనిపించినట్లయితే అవి కిడ్నీ వ్యాధి లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు.